కట్టె కష్టాలు.. తీరేదెప్పుడు..?

కట్టె కష్టాలు.. తీరేదెప్పుడు..?
లావేరు, అక్టోబర్ 30(ఆంధ్ర ప్రభ): మనిషి పుట్టినప్పుడు ఒక మజిలీ, ఆఖరి దశలో రెండవ మజిలీ ఈ మధ్యలోనే ఒక అందమైన జీవితం. శ్రీకాకుళం జిల్లా (Srikakulam district) లావేరు మండలం కొత్త కుంకం పంచాయితీ కొండ కుంకం గ్రామంలో ఎవరైనా మృతి చెందితే దహన సంస్కారాలకు అష్ట కష్టాలు తప్పడం లేదు. ఆ గ్రామంలో దేవర పాపయ్య (75) మృతి చెందగా అంత్యక్రియలు చేసేందుకు స్మశానానికి తీసుకు వెళ్లేందుకు ఆ గ్రామస్తులు కుటుంబీకులు నరకం చూశారు.
అంత్యక్రియలు చేయడానికి స్మశానానికి దారి లేకపోవడంతో పంట పొలాల్లోంచి మోకాళ్ళ లోతు నీటిలో గట్లపై బురదలో జారిపోతూ అతి కష్టం మీద ఇబ్బందులు పడుతూ స్వర్గ ధామానికి తీసుకెళ్లారు. సుమారు 500 మంది జనాభా ఉన్న ఈ గ్రామములో ఇటువంటి బాధలు తప్పడం లేదని స్మశాన వాటికకు రోడ్లు బోరు షెడ్డు ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులను అధికారులను ఆ గ్రామస్తులు వేడుకుంటున్నారు.
