ఏజెన్సీలో ఉప్పొంగుతున్న వాగులు, వంకలు
- నిండుగా ప్రవహిస్తున్న గోదావరి
వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండలంలో వర్షం దంచికొట్టింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వానలకు మండల పరిధిలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావడం లేదు.
దీంతో రహదారులు నిర్మానుషంగా మారాయి. లోతట్టు ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (heavy rains) కురిసే అవకాశం ఉన్నందున ఎవరు కూడా గోదావరిలోకి చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు.