సర్వే నివేదిక వెంటనే ఇవ్వాలి..

సర్వే నివేదిక వెంటనే ఇవ్వాలి..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో మెంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు సంబంధించి ఈ రోరో జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ చాగలమర్రి(Kolla Bathula Karthik Chagalamarri), ఆళ్లగడ్డ తదితర మండలాలలో పంట నష్టం అంచనా ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ మాట్లాడుతూ.. జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రతి పంటలకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.

జిల్లాలోని ప్రతి మండలంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టం అంచనాను రేపటిలోగా పూర్తి చేసి నివేదిక జిల్లా ఉన్నతాధికారులకు పంపించాలి అన్నారు. పంట నష్టం అంచనాకు సంబంధించి ఒక్క రైతు కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా పకడ్బందీగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ క్రాప్ బుకింగ్(crop booking) ద్వారా పంట నష్టం అంచనా ఈజీగా నమోదు చేయవచ్చునని వ్యవసాయ అధికారులు ప్రతి రైతును సంప్రదించి ఆధార్ కార్డులు పరిశీలించి పంట నష్టం అంచనా కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు.

మొంథా తుఫాన్ ప్రభావంతో పంట దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని ఇందులో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చాగలమర్రి మండలంలోని పుట్లూరు, నేలంపాడు, ఆళ్లగడ్డ మండలంలోని మిట్టపల్లి(Mittapalli) గ్రామంలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. సంబంధిత అధికారులకు పంట నష్టం అంచనా వేయడంలో తగు సూచనలు సలహాలు ఇస్తూ దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply