నీట మునిగిన దేవుని తండా
మహా ముత్తారం, ఆంధ్రప్రభ : మండలంలో కురుస్తున్న అకాల వర్షానికి పలు తండాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. మండలంలోని పెద్దవాగు (Pedda Vagu) లో లెవెల్ కల్వర్టు పై నుండి నీరు ప్రవహిస్తుంది. బోర్లగూడెం (Borlagudem) గ్రామంలోని దేవుని తండాలోని పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. అలాగే రహదారులు ముంపునకు గురయ్యాయి.

ఈ గ్రామంలో సైడు కాలువ లేకపోవడంతో వర్షం వచ్చినప్పుడల్లా పొలాలు నుంచి గ్రామంలోకి నీరు రావడంతో పురవీధులు ముంపునకు గురవుతున్నాయి. దీంతో తండా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు (Officers) స్పందించి గ్రామంలో సైడు కాలువలు ఏర్పాటు చేసి వర్షాకాలం గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నారు.
