కన్న తల్లిని కడతేర్చిన కొడుకు..

  • కొడవలితో తల్లి తలపై దాడి.
  • తల్లి మృతి… మద్యం మత్తులో కొడుకు.
  • హంతకుడిని విద్యుత్ స్తంభానికి కట్టేసిన గ్రామస్తులు.
  • 2015లో మామనే హత్య చేసిన వైనం.

చేవెళ్ల : వెండి నగల కోసం కన్న తల్లిని కడతెర్చాడు ఓ ప్రబుద్ధుడు. కనిపెంచి, నవ మాసాలు మోసిన తల్లిని కాటికి పంపాడు. కాటికి కాళ్లుసాచిన వయసులో సపర్యలు చేసేది పోయి.. వెండి నగల కోసం మాతృమూర్తి అని చూడకుండా కొడవలితో తల్లి తలపై మోది సభ్యసమాజం తలదించేకునే విధంగా అతి కిరాతంగా హత్య చేశాడు.

తీరా తనకు ఏమి తేలియదన్నట్లు గ్రామంలో దొరికిన మద్యం సేవించాడు. తన తల్లి మధ్యాహ్నమైన నిద్ర లేవడం లేదని చుట్టు ప్రక్కల వారికి తెలిపాడు. ఇరుగుపొరుగు ఇంట్లోకి వెళ్లి చూడగా వృద్ధురాలు వంటిపై రక్తగాయాలతో విగతజీవిగా కనపించింది. దీంతో ఇరుగుపొరుగు వారు తాగుబోతు కొడుకును ఇంటి సమీపంలోని విద్యుత్ స్తంబానికి కట్టివేసి చితకబాదారు.

చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలైన వృద్ధమహిళ శవంను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హంతకుడైన కన్న కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హృదయ విధాకరమైన సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రేగడిఘనాపూర్ గ్రామం శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఘటన ఆలస్యంగా సాయంత్రం వెలుగులోకి వచ్చింది.

సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం… చేవెళ్ల మండలం రేగడి ఘనపూర్ గ్రామానికి చెందిన గొంగుపల్లి నర్సమ్మ(70) దారుణంగా కన్న కొడుకైన గొంగపల్లి జంగయ్య చేతిలో హత్యకు గురైంది. నర్సమ్మకు ఐదుమంది సంతానం. కాగా భర్త వీరి చిన్నప్పుడే మృతి చెందాడు.

నలుగురు కొడుకులు శంకరయ్య (ఇది వరకే మృతి)ను చందిప్పకు. యాదయ్యను లింగంపల్లికి. జంగయ్యను (హంతకుడు) అంగడి చిట్టెంపల్లికి ఇళ్లరికం ఇచ్చారు. మరో కొడుకు సామయ్య గ్రామంలోనే ఉన్నాడు. కూతురు లక్ష్మీని కమ్మెటకు గ్రామంలో ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించింది.

నర్సమ్మ ఒంటరిగానే పాత ఇంట్లో ఉంటూ ఫించన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తుండేది. కాగా నాలుగవ సంతానమైన గొంగుపల్లి జంగయ్య మద్యానికి బానిసైయ్యాడు. ఇతనికి ముగ్గురు సంతానం. అంగడి చిట్టెంపల్లి నుంచి ఘణపూర్కు అప్పుడప్పుడు వచ్చి తల్లివద్ద ఫించన్ డబ్బులు తీసుకెళ్లేవాడు.

గత నాలుగైదు నెలలుగా గ్రామంలోనే ఉంటున్నాడు. మద్యానికి బానిసైన ఇతను చేతిలో డబ్బులు లేకపోవడంతో తల్లి వంటిపై ఉన్న వెంద నగలు (కాళ్ల కడియాలు. మెదలో గోలుసు) పై కన్నేయడం జరిగింది. నగలు ఇవ్వమని అడగగా తల్లి ఇందుకు నిరాకరించింది.

2015లో మామనే హత్యచేసిన వైనం…

హంతకుడు జంగయ్య గత నేరచరిత్ర సైతం ఘనంగానే ఉంది. ఏరికోరి ఇళ్లరికం తీసుకుపోయిన మామ( భార్య తండ్రి)నే ఇతడు కడతె ర్చాడు. 2015 సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. అప్పట్లో వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం చన్రోమోల్ పోలీస్ స్టేషన్లో హంతకుడు జంగయ్యపై కేసు నమోదు అయ్యింది.

అయితే బెయిల్పై ఇతను తిరిగి వచ్చాక తాను పూర్తిగా మారిపోయానని భార్య సునంద, బంధువుల కాళ్లవేళ్ల పడ్డాడు. పిల్లల భవిష్యత్ చూసి భార్య సునంద సరైన విధంగా కోర్టులో సాక్ష్యం చెప్పలేదు. దీంతో 2016 సంవత్సరంలో ఈ కేసును అప్పట్లో కోర్టు కొట్టివేసింది.

Leave a Reply