మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం

జైనూర్, ఆంధ్రప్రభ ; ఆనాటి కాలంలో మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని జైనూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ అన్నారు.శనివారం కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే చౌక్ లో మాలి సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు హుస్సేన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి, మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్, మాంగ్ సమా జ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు మవాలే దత్త మాంగ్, శివునూర్ సర్పంచ్ జాదవ్ శ్రావణ్, జైనూరు మండల సర్పంచ్ల సంఘం మాజీ మండల అధ్యక్షులు మడావి భీంరావు నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆనాటి కాలంలో కులవివక్ష విద్య విషయాలపై ఎన్నో సేవలు చేశారని ఒక సంఘసంస్కర్తగా ఆయన చేసిన సేవలు మరువలేని అని అన్నారు. ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాలి సంఘం మండల అధ్యక్షులు పెట్టుకులే హుస్సేన్, మాలి సంఘం నాయకులు జంగ్టే రాందాస్, వాడు పులే శేష రావు, జయరాం, తదితరులు పాల్గొన్నారు.
