మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు ఆదర్శనీయం

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆనాటి కాలంలో మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన సేవలు ఆదర్శనీయమని బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆన్నారు. శనివారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని రితీష్ రాథోడ్ నివాసంలో బిజెపి మండలశాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ జయంతి వేడుకలు నిర్వహించారు.

మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన చేసిన సేవలను భావితరాలకు అందే విధంగా ప్రతి ఏడాది ఆయన జయంతి వర్ధంతి వేడుకలను నిర్వహించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, ఉట్నూర్ బిజెపి మండల అధ్యక్షులు బింగి వెంకటేష్, జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్,మాజీ ఎంపీపీ ధనలాల్, బిజెపి నాయకులుసాడికి రాజేశ్వర్, సీపతి లింగాగౌడ్, కందుకూరి రమేష్,కొమ్ము రామచందర్, రాథోడ్ శేషారావు, భానోత్ జగన్అడ్వకేట్, నాగభూషణం, కాల్వరవి, సానాగోపికృష్ణ,రామగిరి వేణు, లక్ష్మణ్, ప్రవీణ్, చింతలరమణ, రామేశ్వర్,జాదవ్ రవి, ఉష్కమల్ల దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply