నిందితుని కోసం గాలింపు..

మేడ్చ‌ల్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని పోచారం ప్రాంతంలో ఈ రోజు సాయంత్రం కాల్పుల క‌ల‌క‌లం సృష్టించింది. ఇబ్రహీం అనే వ్యక్తి ప్రశాంత్ సింగ్ సోనూపై కాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడు ఆ ప్రదేశం నుండి పారిపోయాడు. దీనిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ప్రశాంత్ సింగ్ సోనూను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతడి భుజానికి బుల్లెట్ గాయాలైనట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన నిందితుడు ఇబ్రహీం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply