మండు వేసవిలో మంచు వాసనలు..

మండు వేసవిలో మంచు వాసనలు..
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : నల్లగొండ మండలంలో మండు వేసవిలో మంగళవారం ఉదయం మంచు కురుస్తూ కనువిందు చేస్తుంది. హేమంత ఋతువులో హిమం కురిసిన మాదిరిగా భగభగ మండే ఈ ఎండాకాలం మంచు కురుస్తూ చూపరులను, ప్రకృతి ప్రేమికులను మైమరపించింది. ఉదయం 7గంటలకే సూర్యుడు మండే ఈ సమయంలో ఆకాశం మబ్బులు కమ్ముకుని చల్లని శీతల గాలులు వీస్తున్నాయి. ఒకింత హాయిగా ఉన్నా, మరో వైపు రైతన్నలు అకాల వర్షాలు కురుస్తాయని ఆందోళన చెందుతున్నారు.
