తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. సర్వదర్శనం భక్తులకు 18-20 గంటల సమయం పడుతుంది. రూ.300 శీఘ్రదర్శనానికి 3-4 గంటలు, సర్వదర్శనం టోకెన్ ఉన్న భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది. నిన్న (సోమవారం) స్వామివారిని 80,502 మంది భక్తులు దర్శించుకోగా.. 31,890 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.88 కోట్లు వచ్చినట్లు తెలిపారు.

Leave a Reply