సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని జిల్లా వారాల సంఘ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. హన్మకొండ కొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని తెలంగాణ వారాల సంఘ భవనంలో గ్రామ శాఖ అధ్యక్షులు పాపిశెట్టి రాజు అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ,ప్రైవేటు ఉపాధ్యాయునీలు అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగస్థులైన కందుకూరి శేష వేణి,గుండమీది విష్ణు ప్రియ,అమిరిశెట్టి నిర్మల,పసుల స్రవంతి,గుండమీది సునీత,పాపిశెట్టి విజయ లక్ష్మి,పాపిశెట్టి రాధిక,పాపిశెట్టి కృష్ణ వేణి,గుండమీది సునీత గుండమీది పావని,కత్తెర సంధ్యారాణి, అమిరిశెట్టి లావణ్యలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించే దిశలో పయనిస్తూ సమాజ అభివృద్ధిలో ముందుండాలని రాజు కోరుతూ మహిళలను అభినందించారు. ఈ కార్యక్రమంలో వారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి పాపిశెట్టి కృష్ణ వేణి,గ్రామ సభ్యులు మోలుగురి శారద, కందుకూరి సుగుణావతి,పాపిశెట్టి కవిత పాపిశెట్టి శ్రీధర్, కందుకూరి చంద్రమోహన్జి ల్లా అధ్యక్షులు గుండమీది రవీందర్, ప్రధాన కార్యదర్శి కందుకూరి సంజీవ్,గంట నాగేశ్వర్ గుండమీది కృష్ణ మోహన్, గుండమీది విజయ్ మోహన్ కందుకూరి శ్రీకాంత్ కొండమీది శ్రీనివాస్,పాపిశెట్టి అభిలాష్,సాంబయ్య,కనపర్తి సమ్మయ్య,గుండమీది ప్రశాంత్ లు పాల్గొన్నారు.

Leave a Reply