TG | లిక్క‌ర్ అమ్మిన క‌విత.. రాహుల్ ను విమ‌ర్శించ‌డ‌మా.. పీసీసీ చీఫ్

హైదరాబాద్‌ : రాహుల్‌ గాంధీపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ భూముల అమ్మకాల లెక్కలపై మాట్లాడాలన్నారు. లిక్కర్ వ్యాపారం చేసిన కవిత.. రాహుల్ పై మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇవాళ గాందీభ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడుతూ… ‘కవిత వాళ్ల నాన్న, అన్న హైదరాబాద్‌ చుట్టూ 10వేల ఎకరాల భూమిని ప్రైవేటు సంస్థలకు అప్పనంగా ఇచ్చారు. ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా వాటి లెక్కలు బయటకు తీయాలి. లిక్కర్‌ వ్యాపారం చేసిన ఆమె.. దేశం కోసం శ్రమిస్తున్న రాహుల్‌ గాంధీని విమర్శిస్తే ప్రజలు హర్షించరు’ అని వ్యాఖ్యానించారు.

Leave a Reply