బాసర పుణ్యక్షేత్రం చేరుకున్న శృంగేరి పీఠం జగద్గురు….

బాసర (ఆంధ్రప్రభ) : విజయ యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రానికి దక్షిణామ్నాయ శృంగేరి పీఠం జగద్గురువు విధుశేఖర భారతి మహాస్వామి చేరుకున్నారు.

వ్యాస మందిరం నుండి అమ్మవారి ఆలయం వరకు ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు మంగళ వాయిద్యాలతో, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం శృంగేరి పీఠం జగద్గురువు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ అంజని దేవి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply