సుంకెనపల్లిని ఆదర్శ గ్రామంగా చేయడమే లక్ష్యం..

చిట్యాల, ఆంధ్రప్రభ ; స్వచ్ఛ సుంకెన పల్లి గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చిట్యాల మండలం సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత యాదయ్య తెలిపారు. శనివారం నాడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యచరణలో భాగంగా రెండవ రోజు చిట్యాల మండలం సుం కెనపల్లి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్ విచ్చేసి సర్పంచ్ పాలకవర్గం పంచాయతీ కార్మికుల తోటి చేత పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించి ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు.
అనంతరం సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య గ్రామంలో అన్ని వార్డులలో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు గ్రామాల సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు గ్రామాన్ని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లా సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని సర్పంచ్ ధీమా వ్యక్తం చేశారు అనంతరం సర్పంచ్ చీపురు పోరక పట్టి వీధులను శుభ్రపరచారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కోసనం శేఖర్ రెడ్డి వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరుపాలు ఉన్నారు.
