వెస్టిండీస్‌తో మొద‌టి టెస్టు మ‌న‌దే..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలోభారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు (First test)లో భారత్ ఘన విజయం (Great win for India) సాధించింది. మూడు రోజుల్లోనే టెస్టు మ్యాచ్ ముగిసింది. మొదటి టెస్టులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన భారత బ్యాటర్లలో ముగ్గురు సెంచరీలు చేశారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. అనంతరం మూడో రోజు ఆటను ప్రారంభించకముందే భారత్ డిక్లేర్ చేసింది.

286 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. అలాగే ఫీల్డర్లు సైతం మంచి ప్రదర్శన ఇవ్వడంతో రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ జట్టు 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లలో సిరజ్ 3, జడేజా 4, కుల్దీప్ 2, సుందర్ 1 వికెట్ తీసుకున్నారు.

Leave a Reply