భారమవుతున్నారని …

భారమవుతున్నారని …

  • కూతుళ్లను చంపేసిన కసాయి తండ్రి
  • మిస్టరీని చేధించిన పోలీసులు
  • వివరాలు వెల్లడించిన ఏఎస్పి చైతన్య రెడ్డి

కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కన్న కూతుళ్లను పోషించడం భారమవుతుందని బావించిన ఓ కసాయి తండ్రి ముగ్గురు కూతుళ్లను హత్య చేసిన సంఘటన కామారెడ్డిలో కలకలం రేపింది. కామారెడ్డి పట్టణంలోని ఆర్ బీ నగర్ లో నివాసం ఉండే ఇస్మాయిల్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారికి ముగ్గురు కూతుళ్లు అయత్ (8), మరియం (6), సీపత్ (5) ఉన్నారు. కాగా వారి భారాన్ని తగ్గించుకోవాలనుకొని పథకం పన్నారు. దీంతో ఎలాగైనా వారిని హతమార్చాలనుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే తన ఆటోలో ఎక్కించుకొని బయటకు తీసుకెళ్తాని తీసుకెళ్లినట్లు ఏఎస్పీ చైతన్య రెడ్డి సంఘటన వివరాలు వెల్లడించారు. ఇస్మాయిల్ అతని భార్య కామారెడ్డి పోలీసు స్టేషన్ లో తమ పిల్లలు అదృశ్యమైనట్లు శనివారం సాయంత్రం 3 గంటలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఇస్మాయిల్ వారి ముగ్గరు కూతుళ్లను ఉదయమే 11 గంటలకు తీసుకెళ్లి కామారెడ్డి పెద్ద చెరువులో తోసివేసినట్లు విచారణలో తేలినట్లు ఆమె వెల్లడించారు.

కాగా కేసు నమోదు చేయగానే ఐదు బృందాలు కామారెడ్డి రూరల్ సీఐ రామన్ నేతృత్వంలో వెంటనే స్పందించి చేదించే ప్రయత్నంలో భాగంగా సీసీ టీవీ పుటేజీల ఆదారంగా పరిశీలన చేయగా అనుమానం వచ్చి తండ్రి ఇస్మాయిల్ ను విచారించగా ఒప్పుకున్నట్లు తేలిందన్నారు. కాగా అప్పుల భారం ఎక్కువవడం, పిల్లల పోషణ భారంగా మారడం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుందని ఆమె వివరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఆమె తెలిపారు. కన్న తండ్రే కాలయమునిగా మారి అమాయక ఆడబిడ్డల ఊపిరి తీయడం కామారెడ్డిలో కలవరంగా మారింది. ఈ విలేకరుల సమావేశంలో కామారెడ్డి రూరల్ సీఐ రామన్, పట్టణ సీఐ నరహరి, తదితరులు ఉన్నారు.

Leave a Reply