ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షించాలి

గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : ప్లాస్టిక్ వ‌స్తువుల‌కు స్వ‌స్తి చెప్పాల‌ని, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షించాల‌ని పెద్దపెల్లి జిల్లా నేషనల్ గ్రీన్ కార్ప్స్ సమన్వయకర్త జి. అంజన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ రోజు పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాల స్థాయి ఎకో బజార్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని జాతీయ హరిత దళం తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా పెద్దపెల్లి జిల్లా నేషనల్ గ్రీన్ కార్ప్స్ సమన్వయకర్త జి. అంజన్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వస్తువులైన క్యారీ బ్యాగ్స్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసులు, వంటివి వాడకుండా స్టీల్ బాక్సులు, గాజు పింగాణి వస్తువులను వాడాలని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మనోహర్, డాక్టర్ రవి, డాక్టర్ సుధా, డాక్టర్ అంబిక, డాక్టర్ రఘుపతి అనిల్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వై ప్రసాద్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply