డోలు, నాద స్వరములు అందజేత..

డోలు, నాద స్వరములు అందజేత..

బాసర అక్టోబర్ 23 ఆంధ్రప్రభ చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయానికి గురువారం రోజున విజయవాడకు చెందిన శనగశెట్టి జగదీష్ ,బొబ్బిలి ప్రసాద్ కుటుంబ సభ్యులు ఒక డోలు, రెండు నాద స్వర సన్నాయిలు అందజేశారు. వీటి విలువ రూపాయలు 44 వేల వరకు ఉంటుందని తెలిపారు. వీటిని అమ్మవార్ల సుప్రభాత, నివేదన, నీరాజన సేవలలో వినియోగించాలని వారు ఆకాంక్షించారు.

అనంతరం దాతలచే అమ్మవారి చెంత డోలు, నాద స్వరా సన్నాయిలకు ప్రత్యేక పూజలు జరిపించారు. దాతలకు ఆలయం తరపున సత్కరించి, అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏ ఈ ఓ సుదర్శన్ గౌడ్, ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటాక్, రాజేందర్, ఆలయ ఆస్థాన డోలు శ్రీనివాస్, సన్నాయి శృతి వాద్యకార్ల బృందం పాల్గొన్నారు.

Leave a Reply