‘ఓ బీసీ లేసి తెలుసుకో’ ఆవిష్కరణ..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రహదారి బంగ్లాలో యువకవి, రచయిత బైరపాక స్వామి రచించిన ‘ఓ బీసీ లేసి తెలుసుకో.. ఇక మారదు భారతదేశం’ అన్న పాటను టంగుటూరు సర్పంచ్ జూకంటి అనిల్ శుక్రవారం ఆవిష్కరించారు. నాగర్ కర్నూలు కుమ్మెర మల్లన్న జాతరలో మరణించిన రెండు నెలల పసిపాప చిత్రపటానికి నివాళులు అర్పించి ఆవిష్కర్త అనిల్ మాట్లాడుతూ సామాజిక బాధ్యత ఉన్న కవిగా బైరపాక స్వామి సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల తన కలంతో, గళంతో ఆధునిక సమాజానికి చైతన్యవంతంగా నిలవాలనీ ‘ఓ బీసీ లేసి తెలుసుకో ఇక మారదు భారతదేశం ‘అంటూ తన ఆలోచనల సారాన్ని పాటగా మలచి దిశా నిర్దేశం చేశారని చెప్పారు.
మల్లన్న జాతరలో ఆధిపత్య దాడితో జరిగిన పసిపాప మరణాన్ని ఖండిస్తున్నామన్నారు. బాధిత కుటుంబంను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బైరపాక కలం నుండి మరెన్నో ఆణిముత్యం వంటి పాటలు రావాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో సభా అధ్యక్షత సీపీఐ సీనియర్ నాయకులు చెక్క వెంకటేష్ వహించగా, బీసీ సంఘం నాయకులు పేరపు రాములు, శ్రీ కళా తరంగిణి అధ్యక్షుడు చింతకింది రామానుజం, ఎర్ర జాన్సన్, బోడ శ్రీకాంత్, రామకృష్ణ, డాన్స్ మాస్టర్ సంగి వేణు, శ్రీను, శ్రీరాములు, ముల్లంగుల రవి, మహేందర్, బండ యాదగిరి, బన్నీ పాల్గొన్నారు.
