టెండర్ల గడువు ఎప్పటి వరకంటే…

టెండర్ల గడువు ఎప్పటి వరకంటే…

27న డ్రా ద్వారా మద్యం దుకాణాల ఎంపిక
154 మద్యం దుకణాలకు 4619 దాఖలు
నల్గొండ అక్టోబర్ 19(ఆంధ్ర ప్రభ): బీసీ బంద్, బ్యాంకులు బంద్ లతో మద్యం షాపుకు దరఖాస్తులు వేసే ఉత్సాహకులు రాలేకపోయామని, వారు చేస్తున్న విజ్ఞప్తి మేరకు దరఖాస్తులు స్వీకరించడానికి గడువు ఈనెల 23 వరకు పెంచుతున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ బి.సంతోష్ తెలిపారు.

సెప్టెంబర్ 26 నుండి ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ అక్టోబర్ 18 వరకు జిల్లాలోని 154 మద్యం దుకాణాలకు 4619 టెండర్లు దాఖలు అయినట్లు తెలిపారు. బీసీ బంద్ ఎఫెక్ట్ తో రాత్రి 10 గంటల వరకు టెండర్లు స్వీకరించడం జరిగిందన్నారు. ఆశావహులు బ్యాంకులు బంద్ కావడంతో టెండర్లు వేయలేక పోయారని, వారి విజ్ఞప్తి మేరకు గడువు పెంచినట్లు తెలిపారు.ఈనెల 23 న కలెక్టర్ల సమక్షంలో జరగాల్సిన మద్యం షాపుల డ్రా ను ఈనెల 27వ తేదీన కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపులకు డ్రాలు తీయనున్నట్లు వారు పేర్కొన్నారు.

Leave a Reply