DANGER| పొంచి ఉన్న ప్రమాదం..

DANGER| మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామం నుంచి తిరుమలగిరి, అడ్డగుడూర్ వెళ్లే బీటీ రోడ్డు ప్రమాదం అంచున ఉన్నప్పటికీ ఆర్ అండ్ బి అధికారులు నామమాత్రంగా రెడ్ రిబ్బన్ కట్టి, 4 రాళ్లు అడ్డుగా పెట్టి తమ పని ఇంతే అన్నట్లుగా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాటిమట్ల చెరువు వెంట ఓ బావికి బీటీ రోడ్డు అనుకొని ఉంది.

ఈ బీటీ రోడ్డు సైడ్ బర్మ్స్ పూర్తిగా లేకపోవడంతో ఈ రూట్లో నిత్యం వందలాది బస్సులు, వాహనాలు వెళ్తుండడంతో ఈ ప్రదేశంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎదురెదురుగా రెండు వాహనాలు వచ్చినప్పుడు పెద్ద ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. కానీ ఆర్ అండ్ బి అధికారులు కేవలం ప్రతిపాదనలు పంపడమే తప్ప.. తాము చేసేది ఏమి లేదు అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు నివారించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a Reply