Nandyal | రైతన్న మీకోసంలో కలెక్టర్

Nandyal | రైతన్న మీకోసంలో కలెక్టర్


రైతుల సమస్యలపై ఆరా

Nandyal | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 నుంచి 29 వరకు నిర్వహిస్తున్న ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఈ రోజు దొర్నిపాడు మండలం గుండుపాపల గ్రామంలోని రైతుల పొలాలను సందర్శించారు. కలెక్టర్ (Collector) రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ త‌దిత‌ర పథకాలు అందుతున్న తీరు గురించి రైతులు వెంకటేశ్వర్లు, చిన్న దస్తగిరిని అడిగి తెలుసుకున్నారు. స్పందించిన వారు… మొదటి విడతలో అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 5 వేలు, పీఎం కిసాన్ కింద  రూ.2 వేలు, రెండో విడతలో మరోసారి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద రూ.2 వేలు మొత్తం రూ.14 వేలు తమ ఖాతాల్లో జమ అయ్యాయని కలెక్టర్‌కు వివ‌రించారు.

ఇంకా రైతులకు (Farmers) ఎలాంటి మద్దతు అవసరమో తెలుసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని క‌లెక్ట‌ర్‌ భరోసా ఇచ్చారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల ద్వారా లభించే అవకాశాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు కోయిలకుంట్ల వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్, దొర్నిపాడు తహసీల్దార్, ఎంపీడీవో, మండల వ్యవసాయ అధికారి, స్థానిక సర్పంచ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply