- బీఆర్‌ఎస్ హయాంలో తగ్గిన మాతా శిశు మరణాలు
- దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో కేరళ, రెండో స్థానంలో తెలంగాణ
- 2019-2021 ఎస్‌ఆర్‌ఎస్ గణాంక నివేదిక విడుదల
పదేళ్ల కేసీఆర్ పాలనలో తల్లులు, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చేసిన కృషిని కేంద్రం ప్రశంసించింది. మాతాశిశు ఆరోగ్యంలో తెలంగాణ రాష్ట్రం గొప్ప పురోగతి సాధించిందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఆరోగ్య కార్యక్రమాలకు గౌరవ సూచకంగా, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన శిశు మరణాల రేటు, తల్లి మరణాల రేటు తగ్గించడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానాల్లో ఉంది.
ఈరోజు (గురువారం) ఢిల్లీలోని జనగణన ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయం 2019-21 నమూనా నమోదు వ్యవస్థ (ఎస్‌ఆర్‌ఎస్) గణాంక నివేదిక విడుదల చేసింది.
ఆ నివేదిక ప్రకారం దక్షిణ భారతదేశంలో కేరళ తరువాత తల్లి మరణాల రేటు తగ్గింపులో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.
మెరుగైన స్థితిలో ఉన్నాం..
శిశు మరణాల రేటు గ్రామీణం, పట్టణ ప్రాంతాల్లో కాస్త వ్యత్యాసంగా ఉంది. నగరాల్లో 16, గ్రామీణంలో 23గా నమోదైంది. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటులో 2014-15లో 41గా ఉండగా, 2021 నాటికి 22కి తగ్గింది. దేశ సగటు 31 కాగా, తెలంగాణ మెరుగైన స్థితిలో ఉంది.
ఇదీ పరిస్థితి…
తల్లి మరణాల రేటులో దేశ సగటు 93 ఉండగా, దక్షిణ భారత సగటు రేటు 47గా నమోదైంది. తెలంగాణ (45), ఆంధ్రప్రదేశ్ (46), కర్ణాటక (63),తమిళనాడు(49), కేరళ (20), బీహార్ (100), ఉత్తరప్రదేశ్(151), గుజరాత్(53), మధ్యప్రదేశ్(175), ఛత్తీస్‌గఢ్ (132) ఉండటం గమనార్హం.
శిశు మరణాల రేటులో దేశ సగటు 27 నమోదు కాగా.. తెలంగాణ (20), ఆంధ్రప్రదేశ్ (22), కర్ణాటక (17), తమిళనాడు(12), కేరళ(6) ఉండటం విశేషం. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటులో దేశ సగటు ( 31) ఉండగా, తెలంగాణ (22), తమిళనాడు(14), కేరళ (8)రాషా్ర్టలు ఉన్నాయి.
శిశు మరణాల రేటు తగ్గింది..
తల్లి మరణాల రేటులో దేశ సగటు 93గా ఉండగా, తెలంగాణలో 45గా నమోదైంది. కేరళ (20), తమిళనాడు (49), ఆంధ్రప్రదేశ్ (46), కర్ణాటక (63)గా నమోదయ్యాయి. 2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలో శిశుమరణాల రేటు 39గా ఉండగా, ఇప్పుడు అది 20కి తగ్గింది. దేశ సగటు 27గా ఉండగా, తెలంగాణ ఇందులో మెరుగ్గా నిలిచింది. తమిళనాడు (12), కర్ణాటక (17), ఆంధ్రప్రదేశ్ (22), కేరళ (6) రాష్ర్టాలు నిలిచాయి.