గోసాడి నృత్యంతో సంద‌డి

గోసాడి నృత్యంతో సంద‌డి

క‌డెం, ఆంధ్ర‌ప్ర‌భ : కడెం మండలంలోని ఉడుంపూర్ పంచాయ‌తీ మిద్దె చింత గ్రామంలో దండారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివాసీలు ఆరాధ దైవం ఎత్మానూర్ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి డప్పు, వాయిద్యాల‌తో గోసాడి నృత్యం చేశారు. ఈ ఉత్సవాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ , ఆయ‌న‌ త‌న‌యుడు తనీష్ పటేల్ నీతిష్ పటేల్ పాల్గొని తలకు బాగా కట్టి తోటి ఆదివాసుల‌తో కోలాటం ఆటలు ఆడి గుసాడి నృత్యాలు చేస్తూ సంద‌డి చేశారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ మాట్లాడుతూ మిద్దె చింత గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని, అలాగే ర‌హ‌దారి సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని, అలాగే గ్రామంలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడెం మండల నాయకులు జొన్నల చంద్రశేఖర్ గుప్తా బెడద సత్తన్న , ఖానాపూర్ ఆత్మ కమిటీ డైరెక్టర్ బెడద అంజి వర్మ, ఉడుంపూర్ బీపీఎం బొడ్డు గంగాధర్ కాంగ్రెస్ నాయకులు అచ్చే రాజన్న డి. శ్రీనివాస్ కాశ వేణి లింగన్న, భూమేష్ , ఏ రాకేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply