Books |సమాజానికి దారిదీపం !!

Books |సమాజానికి దారిదీపం !!

  • కల్చరల్ కమిషన్ చైర్‌‌పర్సన్ పొడపాటి తేజస్విని

Books | ఆంధ్రప్రభ, భవానిపురం : పుస్తకాలు వ్యక్తిత్వాలను ప్రభావితం చేస్తూ, సమాజ చైతన్యానికి దారిదీపాలుగా నిలుస్తాయని క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్ చైర్‌‌పర్సన్ పొడపాటి తేజస్వి అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విజయవాడలోనే కేబీఎన్ కళాశాలలో సోమవారం తేజస్వి లాంచనంగా ప్రారంభించారు.

ఆమె మాట్లాడుతూ… పుస్తకాన్ని మించిన గొప్ప మిత్రుడు మరొకరు ఉండరన్నారు. పుస్తకానికి మించిన వేగమంతమైన టెక్నాలజీ మరొకటి లేదన్నారు. డిజిటల్ తరానికి ఇన్స్పిరేషన్ అయిన అలాన్ మాస్క్ ప్రతిరోజు పుస్తకం చదువుతారని, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఏడాదికి 50 పుస్తకాలు చదువుతారన్నారు.డిజిటల్ తరం తయారు చేసిన వ్యక్తులు అందరూ పుస్తక ప్రేమికులే అని చెప్పారు.

ఉపముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ పుస్తకాన్ని తన గురువుగా భావిస్తారని చెప్పారు. సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాజమౌళి వంటి వ్యక్తుల ప్రతిభ పుస్తకాలు చదవడం వల్లనే సాధ్యమైందన్నారు. అబ్దుల్ కలాం వంటి వ్యక్తుల బయోగ్రఫీ చదివితే వాళ్ళతో మనం నేరుగా మాట్లాడినట్టు అనిపిస్తుందన్నారు. వారోత్సవాల సందర్భంగా కనీసం ఒక్క పుస్తకం అయినా చదవాలని విద్యార్థులకు సూచించారు.

ప్రిన్సిపాల్ డాక్టర్ జి. కృష్ణవేణి మాట్లాడుతూ… పుస్తక పఠనం ద్వారా మనోవికాసం సాధ్యమవుతుందన్నారు. విద్యార్థుల జీవితంలో పుస్తక పఠనం భాగం కావాలన్నారు.

హిందూ హై స్కూల్స్ కమిటీ పరిపాలనాధికారి డాక్టర్ వి. నారాయణ రావు మాట్లాడుతూ.. రీడర్స్ మాత్రమే లీడర్స్ గా ఎదుగుతారన్నారు. ఫెడరల్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన 30 కుట్టు మిషన్లను పేద మహిళలకు అందజేశారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.రామకృష్ణ కార్యక్రమాన్ని నిర్వహించారు. లైబ్రేరియన్ శ్రీనివాస రాజు, గ్రంథాలయ సిబ్బంది విజయ లక్ష్మి, నాగ లక్ష్మి పాల్గొన్నారు.

Leave a Reply