- కలెక్టర్ కు ఇందిరానగర్ వాసులు కృతజ్ఞతలు
- ఇందిరానగర్ ప్రజలకు ఊరట
- ఆ సమస్యకు పరిష్కారం చూపిన కలెక్టర్ హనుమంతరావు ..
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధి ఆరెగూడెం గ్రామ ఇందిరానగర్ కాలనీలో రేషన్ పంపిణీ కి చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు చిత్రపటాని కాలనీ వాసులు ఈ రోజు పాలాభిషేకం చేశారు.
ఇందిరానగర్ నుండి ఆరెగూడెంకు ప్రతినెలా రేషన్ సరుకుల కోసం వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక వృద్ధులు దివ్యాంగులు , ఒంటరి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరానగర్ లో 70 కార్డులు ఉన్నాయి.
ఇందిరానగర్ నుండి ఆరెగూడెం వరకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం కలదు. ప్రయాణ సౌకర్యం లేక రేషన్ సరుకులు తేవడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రేషన్ కార్డుదారులు వినతి మేరకు
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేషన్ డీలర్ లక్ష్మయ్య సహకారంతో ఇందిరానగర్ కాలనీవాసులకు రేషన్ బియ్యం ఈ రోజు పంపిణీ చేశారు. ఇందుకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపి పాలాభిషేకం చేశారు.


