ధ‌న్య‌వాదాలు చెప్పిన ఎఫ్‌టీఎస్ అసోసియేష‌న్‌

ధ‌న్య‌వాదాలు చెప్పిన ఎఫ్‌టీఎస్ అసోసియేష‌న్‌

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : టెరాసిస్(Terraces) అనే ప్రైవేటు సంస్థ త‌రుఫున ధ‌ర‌ణి అప‌రేట‌ర్లుగా ఉన్నతమ‌ను తెలంగాణ భూభార‌తి ఫీల్డు స్టాఫ్‌గా అవ‌కాశం ఇస్తూ టీజీటీఎస్ కాంట్రాక్టు(TGTS contract) ఉద్యోగులుగా గుర్తించి, జీతాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ భూభార‌తి ఫీల్డ్ టెక్నిక‌ల్ స్టాఫ్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ కొన‌గాల మ‌హేశ్(Dr. Kongala Mahesh) ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఎఫ్‌టీఎస్‌గా 708 మందిని నియ‌మించిన‌ట్లు తెలిపారు. అలాగే రూ.12,000 ఉన్ననెల జీతాన్ని రూ.28,148 లకు పెంచుతూ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవ‌డంపై ఆయ‌న ఆనందం వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలో ఆర్థిక‌ ఇబ్బందులు ఉన్నప్పటికీ, త‌మ‌పై దయతో ఇంతటి నిర్ణయం తీసుకున్నముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Chief Minister Revanth Reddy), రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు), రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీసీఎల్ఏ అధికారులు లోకేష్ కుమార్‌, మ‌క‌రందం, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మ‌న్ ల‌చ్చి రెడ్డికి మ‌హేశ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Leave a Reply