TGTET-2026 | ప్రాథమిక ‘కీ’ విడుదల..

TGTET-2026 | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET)-2026కి సంబంధించిన ప్రాథమిక కీ విడుదలైంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టీజీటెట్ చైర్మన్ డాక్టర్ నవీన్ నికోలస్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, అభ్యర్థులు తమ ‘కీ’ని https://schooledu.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక ‘కీ’పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అభ్యంతరాలను సమర్పించడానికి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1, 2026 సాయంత్రం 5 గంటల వరకు సమయం కేటాయించారు.

Leave a Reply