TGCGTA | అధ్యాపకుల హక్కుల సాధనే ధ్యేయం

TGCGTA | అధ్యాపకుల హక్కుల సాధనే ధ్యేయం

  • సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.సురేందర్

TGCGTA | లక్షెట్టిపేట, ఆంధ్రప్రభ : అధ్యాపకుల హక్కుల సాధనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టిజిసిజిటిఏ)పని చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.సురేందర్ రెడ్డి అన్నారు. ఇవాళ‌ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశాన్ని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.కడారు సురేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ… ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులు పిహెచ్.డి.,ఎం.ఫిల్. అర్హతలతో పదోన్నతిపై ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియామకమైనప్పుడు ఇవ్వాల్సిన అడ్వాన్స్ ఇంక్రిమెంట్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు.

జి.ఓ.నంబర్ 213 ద్వారా పిహెచ్.డి.,ఎం.ఫిల్ విద్యార్హతలతో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా డిగ్రీ కళాశాలలో పదోన్నతి పొందిన జూనియర్ అధ్యాపకులకు కూడా నేరుగా నియామకం పొందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లతో సమానంగా ప్రోత్సాహక ఇంక్రిమెంట్లు ఇవ్వడం మన సంఘం సాధించిన విజయమన్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది అర్హులైన అధ్యాపకులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారని తెలిపారు. లెక్చరర్లకు ప్రభుత్వం నుండి ఆర్ధిక ప్రయోజనాల కోసం సంఘం కృషి చేస్తుందని ప్రకటించారు. లెక్చరర్లు కళాశాలల బలోపేతానికి కృషి చేసి, అడ్మిషన్లు పెంచాలని సూచించారు.

TGCGTA

సమాజానికి ఉత్తమ యువతను అందించి అధ్యాపకుల విలువలను పెంచాలని సూచించారు. అనంతరం మంచిర్యాల జిల్లా సభ్యులు ఘనంగా ఆయనకు సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం జోనల్ కార్యదర్శి జాడి శంకరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్, అధ్యక్షుడు డా.తన్నీరు సురేష్, చెన్నూరు కళాశాల ప్రిన్సిపాల్ డా.పట్వర్ధన్ సంఘం సభ్యులు సత్య ప్రకాష్, తోట మహేష్, సంతోష్ కుమార్, తిరుపతి, నాగేశ్వర్, శ్రీనివాస్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply