TG | జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం..

TG | జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం..

  • మామకన్ను గ్రామ పంచాయతీ సమస్యలను పరిష్కరించాలి
  • సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన సర్పంచ్

TG | ఆళ్లపల్లి గుండాల, ఆంధ్రప్రభ : గుండాల మండలం మామకన్ను పంచాయతీలోని నెలకొన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యటనలో భాగంగా అందించడం జరిగిందని, మామకన్ను పంచాయతీ సర్పంచ్ కల్తీ రజిత, ఉపసర్పంచి కొడెం భరత్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన సమస్యలు సిసి రోడ్లు ఇందిరమ్మ ఇండ్లు అంగన్వాడి కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మాణం, నీటీ సదుపాయం పలు సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు సర్పంచి ఆధ్వర్యంలో అందించడం జరిగిందని సర్పంచ్ కల్తీ రజిత ప్రశాంత్ తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థను సంపూర్ణంగా నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అదే క్రమంలో గుండాల మండల ప్రజలు భద్రాద్రి కొత్తగూడెం వెళ్లాలంటే ఇల్లందు మీదుగా చుట్టూరా తిరిగి వెళ్లడంతో అధిక ఖర్చులతో భారంతో కూడుకున్నదని,ఈనేపథ్యంలో మామకన్ను నరసాపురం మీదుగా కిన్నెరసాని జల్లేరు మీదుగా ఆళ్లపల్లి అనంతొగు, సంపత్ నగర్ సులువుగా వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఎనిమిది ఏండ్లుగా నత్తనడకన నడుస్తున్న నిర్మాణంలో ఉన్న హైలెవెల్ వంతెనకు అటవీశాఖ అనుమతులు త్వరితగతిన వచ్చేందుకు,తెలంగాణ రాష్ట్ర, జిల్లామంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. మామకన్ను పంచాయితీ కేంద్రంలోని డ్రైనేజీ వ్యవస్థను సంపూర్ణంగా, శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేయాలని, అనేక మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని, అర్హులైన వారికి రెండో దశలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలని, సమస్యలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు క్షుణ్ణంగా వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భరత్ పాలకవర్గం గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply