క‌న్నుక‌ప్పి.. క‌బ్జా చేసి

క‌న్నుక‌ప్పి.. క‌బ్జా చేసి

ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం

ఘట్‌కేసర్, ఆంధ్రప్రభ : మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండల్ రెవెన్యూ పరిధిలోని పకీటిక గ్రామంలో రాజీవ గృహకల్ప శివాలయం ఎదురుగా సర్వేనెంబర్ 107 ప్రభుత్వ స్థలంలో 120 చదరపు గజాలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు జ‌రుగుతున్నాయి. శనివారం, ఆదివారం అధికారులు అందుబాటులో ఉండరని అతివేగంగా నిర్మాణం చేప‌డుతున్నారు. గతంలోనూ ఇదే సర్వే నంబర్లు కొందరు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే.. రెవెన్యూ అధికారులు వాటిని కూల్చివేయించారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అక్ర‌మ నిర్మాణాన్ని ప‌రిశీలించి తక్షణమే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply