IPASS| గడువులోగా అనుమతులివ్వాలి…

IPASS | గడువులోగా అనుమతులివ్వాలి…
కలెక్టర్ సిక్తాపట్నాయక్
IPASS | నారాయణపేట, ఆంధ్రప్రభ : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టి.జి. ఐపాస్ కింద పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను వివిధ శాఖలు నిర్ణీత గడువులోగా జారీ చేయాలని జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ (Collector Sikta Patnaik) సూచించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు.
పరిశ్రమల పెరుగుదలతో జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి శాఖ సమన్వయంతో వ్యవహరించి అనుమతుల మంజూరులో ఆలస్యం జరగకుండా చూడాలని ఆమె స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్సీ 12, ఎస్టి 4, పీహెచ్సీ 1 మందికి పెట్టుబడి సబ్సిడీ మంజూరు చేయడానికి డీఐపీసీ కమిటీ ఆమోదం (DIPC Committee approval) తెలిపింది.
ఈ కార్యక్రమంలో జీఎం లింగేశ్వర్ గౌడ్, ఐపీవో నర్సింగ్ రావు, ఎల్డిఎం విజయ్‌కుమార్, సీటీఓ ప్రవీణ్‌కుమార్, అసిస్టెంట్ హైడ్రాలాజిస్ట్ నరేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, విద్యుత్ శాఖ ఎస్సీ వెంకటరమణ, ఎస్ఆర్ఓ కృష్ణగౌడ్, సాయి తేజరెడ్డి, ఇరిగేషన్ ఈఈ బ్రహ్మానంద, డిపిఓ సుధాకర్ రెడ్డి, లేబర్ శాఖ తిలక్, తదితర అధికారులు పాల్గొన్నారు.
