హైదరాబాద్, : సమాజంలో మీడియా పాత్ర చాలా గొప్పదని తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు.
హై బిజ్ టీవీ మీడియా అవార్ట్స్ 5వ ఎడిషన్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్ర ఉమ్యమం, తెలంగాణ ఉద్యమం వంటి ఎన్నో సందర్భాల్లో జర్నలిస్టులు కీలకంగా వ్యవహరించాలరని గుర్తు చేశారు. సమాజంలోని వాస్తవికతను బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు వాళ్లంతా అహర్నిశలు పాటుపడుతున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే ఎన్నో అవరోధాలను కూడా ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిజాన్ని నిరంతరం బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు జర్నలిస్టులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం, పాత్రికేయులు కలిసి పని చేయాల్సిన అవసరముందని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.

.హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ నోవాటెల్ లో జరిగిన ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం. రవీందర్ రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి. రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ పాండు రంగారావు (ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్), ఎం. రాజ్ గోపాల్ (మేనేజింగ్ డైరెక్టర్ – హై బిజ్ టీవీ & తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (మేనేజింగ్ డైరెక్టర్ – హై బిజ్ టీవీ ఎల్.ఎల్.పి) తదితరులు ఇందులో పాల్గొన్నారు.
హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 5వ ఎడిషన్ లో భాగంగా ముగ్గురికి లెజెండరీ పురస్కారాలు అందజేశారు. ఇద్దరిని విజనరీ అవార్డులతో సత్కరించారు.
*లెజెండరీ పురస్కారాలు:**) దేవులపల్లి అమర్ (ఎడిటర్ – మన తెలంగాణ)
*) షేక్ సుభానీ (కార్టూనిస్ట్ – డెక్కన్ క్రానికల్)
*) జగదీశ్ – ఓటీఎస్ అడ్వర్టైజింగ్
*విజనరీ అవార్డ్స్:**) లక్ష్మీ రావు (ఛైర్మన్ – రాజ్ న్యూస్)*)
శ్రీధర్ (మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ – సాక్షి)
అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు రేడియో కేటగిరీలో కలిపి 60 మందికి పైగా విజేతలు పురస్కారాలను అందుకున్నారు.
దీనిపై వారంతా సంతోషం వ్యక్తం చేశారు. మీడియా రంగంలో తాము చేస్తున్న కృషికి హైబిజ్ టీవీ తగిన గుర్తింపునిచ్చిందని తెలిపారు. ఇది తమకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని హైబిజ్ టీవీని కోరారు. –