TG | న్యాయ‌మూర్తిపై చెప్పు …. నాంపల్లి కోర్టులో ఘటన

జీవిత ఖైదు శిక్ష వేయ‌డంతో దురుసు ప్ర‌వ‌ర్త‌న‌
కోర్టులోనే అత‌డిని చిత‌క‌బాదిన న్యాయ‌వాదులు
పోలీసుల‌కు అప్ప‌గింత‌.. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఘ‌ట‌న

రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉద్రిక్తత నెలకొంది. జీవిత ఖైదు పడిన ఓ నేరస్తుడు నేడు న్యాయమూర్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. రంగారెడ్డి ఫోక్స్ కోర్టు న్యాయమూర్తిపై ముద్దాయి చెప్పు విసిరాడు. ఫోక్సో కేసులో ముద్దాయిగా ప్రకటించడంతో జిర్ణించుకోలేకపోయిన నిందితుడు న్యాయమూర్తిపై ఒక్కసారిగా చెప్పు విసిరాడు. కోర్టులో ఉన్న న్యాయవాదులు నేరస్తుడిని పట్టుకుని చితకబాది.. పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో కోర్టులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply