TG | మోదీ కులంపై రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్యలు…కెసిఆర్ ను వ‌ద‌ల‌ని సిఎం

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భః కులగణన, ఎస్సీ వర్గీకరణపై పక్కాగా చేసిన మా లెక్కను తప్పంటారా అని విప‌క్షాల‌ను ప్ర‌శ్నించారు రేవంత్ రెడ్డి .. కేసీఆర్‌ ఒక్క రోజే సర్వే చేసి కాకిలెక్కలు చూపించార‌ని,అవ‌న్నీ చెట్ల మీద విస్తరాకులు కుట్టినట్టుగా గతంలో సర్వే చేశార‌ని మండిప‌డ్డారు. గాంధీభ‌వ‌న్ లో నేడు జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ, మోదీ కులంపైనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ కాద‌ని. లీగల్లీ కన్వర్టెడ్‌ బీసీ అని పేర్కొన్నారు. 2002 వరకు మోదీది ఉన్నత వర్గమేన‌ని అయితే . ఆయన గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీల్లో కలిపాశార‌ని వివ‌రించారు…

కెసిఆర్ కు తెలంగాణ‌లో జీవించే హ‌క్కులేదు..

దేశంలో కులగణన చేసిన ఏకైక ప్రభుత్వం మాదని రేవంత్ తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాల న‌ష్ట ప‌రిచిన కెసిఆర్ కు తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్‌కు లేద‌న్నారు రేవంత్. కెటిఆర్,హ‌రీశ్ రావు,పోచారం లాంటి గ్యాంబ్లర్స్‌ అంతా బీఆర్ఎస్‌లోనే ఉన్నార‌ని విమ‌ర్శించారు.. కులాల లెక్కలు ఎప్పటికీ తేలకూడదనే ఆ పార్టీ నేతలు పన్నాగం పన్నుతున్నార‌ని, అందుకు కుల గ‌ణ‌న జ‌ర‌గ‌కుండా అడుగ‌డుగునా అడ్డుప‌డుతున్నార‌ని చెప్పారు.. కేసీఆర్ లాంటి వాళ్లు తెలిసి, బలిసి సర్వేలో పాల్గొనలేద‌ని అంటూ . జనాభా లేకపోయినా రావులంతా పదవులు పంచుకున్నార‌ని మండి ప‌డ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన త‌న‌ కోసం కాద‌ని అన్నారు రేవంత్… క్రమశిక్షణ కలిగిన సీఎంగా కులగణన చేయిచామ‌న్నారు. దొంగ లెక్కలు చెప్పాలనుకుంటే త‌మ‌ కులాన్ని ఎక్కువ చూపించేవాళ్లమ‌ని పేర్కొన్నారు.. ఇక బీసీ కులగణనకు రెండో విడత కూడా అవకాశం ఇచ్చామ‌ని అన్నారు. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావును సామాజిక బహిష్కరణ చేయాలని తీర్మానం చేశామ‌న్నారు రేవంత్. కుల‌గ‌ణ‌న‌లో పాల్గొనాలని కేసీఆర్‌, కేటీఆర్‌ ఇళ్ల ముందు డప్పు కొట్టండి” అని త‌న పార్టీ కార్య‌కర్త‌ల‌కు రేవంత్ పిలుపు ఇచ్చారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *