సూర్యాపేట, ఆంధ్రప్రభ : సూర్యాపేట డిఎస్పీ గా ప్రసన్నకుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో డిఎస్పీ పార్థసారధి అరెస్ట్ కాగా ఆయన స్థానంలో ప్రసన్నకుమార్ సూర్యాపేట కు బదిలీ పై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన డిఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.