TG | కొండా సురేఖకు వినతిపత్రం..

TG | కొండా సురేఖకు వినతిపత్రం..

TG, కరీమాబాద్, ఆంధ్రప్రభ : బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల విద్యా ప్రధాత, మహాత్మా జ్యోరావ్ ఫూలే విగ్రహాన్ని శివనగర్ లో ఏర్పాటు చేస్తున్నామని మహాత్మా జ్యోతిరావ్ ఫూలే విగ్రహ కమిటీ అధ్యక్షుడు చిర్ర రాజేష్ ఖన్నా కార్యదర్శి రేణుకుంట్ల శివ తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ని కలవగా వారు సానుకూలంగా స్పందించి విగ్రహ ఏర్పాటులో తనవంతుగా అవసరమైన సహాయం చేస్తానని అన్నారు.

మంత్రి కొండా సురేఖను కలిసిన వారిలో మహాత్మా జ్యోతిరావ్ ఫూలే విగ్రహ కమిటీ అధ్యక్షులు చిర్ర రాజేష్ ఖన్నా, కార్యదర్శి రేణుకుంట్ల శివ, 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు శ్రీరామ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply