తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమే సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేయగా… సీఎం రేవంత్ రెడ్డి సీతా దయాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యులను నియమించింది. కంచర్ల వందనగౌడ్, మర్రిపల్లి చందన, బి.అపర్ణ, గోగుల సరిత, ప్రేమలతా అగర్వాల్, బి.వచన్ కుమార్ లను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.
వీరంతా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి మూడు సంవత్సరాలు లేదా వారికి 60 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.