TG | అంబేద్కర్ ను .రాజకీయంగా, మానసికంగా క్షోభకు గురిచేసింది కాంగ్రెస్సే : ఎంపీ ధర్మపురి

నిజామాబాద్ ప్రతినిధి ఏప్రిల్13: (ఆంధ్రప్రభ)భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను రాజకీయంగా, మానసికం గా ఎంతో క్షోభ కు గురి చేసి లోకసభ ఎన్నికల్లో పోటీ చేసిన అంబేద్కర్ ని పనిగట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఓడించి.. అంబేద్కర్ చావు కి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఎంపీ ధర్మపు అరవింద్ సంచలన వ్యా ఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని రాజకీయం గా వాడుకోవడం తప్ప అంబేద్కర్ ను ఏ నాడు గౌరవించింది లేదని మండి పడ్డారు.

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిజామా బాద్ నగరంలోని పూలాంగ్ చౌరస్తా వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ శుద్ధి కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి, నిజా మాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధన్ పాల్ సూర్య నారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లుపసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పాల్గొన్నా రు.

ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధిచేసి అంబే ద్కర్ విగ్రహానికి పూలమా లలు వేసి అంబేద్కర్ చేసి న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మ పురి అరవింద్ మాట్లాడు తూ భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ జయం తి సందర్భంగా ఒకరోజు ముందు బిజెపి పార్టీ ఆధ్వ ర్యంలో అంబేద్కర్ విగ్రహా ల శుద్ధి కార్యక్రమా న్ని చేపడుతున్నట్లు తెలి పారు. అందులో భాగం గా నే నిజామాబాద్ నగరం లోని అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసినట్లు ఎంపీ తెలిపారు.

అంబేద్కర్ ని మానసికంగా కాంగ్రెస్ పార్టీ ఎంతో క్షోభ పెట్టిందని ఆరో పించారు. అంతేకాకుండా అంబేద్కర్ రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి పనిగట్టుకుని అంబేద్కర్ ని ఓడించిందన్నారు. అంతటి మహనీయుడిని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలె కానీ ఇబ్బంది పెట్టిందన్నారు.

అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం సిగ్గుచేట అన్నారు.అసలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి భారతరత్న అవార్డు ఎప్పు డు వచ్చిందండి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పు డు మాత్రమే భారతరత్న అవార్డు వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అసలు కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని అంబేద్కర్ పేరు వాడుతూ.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుతు న్నామని గొప్పలు చెప్పుకో వడం సిగ్గుచేటు అన్నారు. అంబేద్కర్ పుట్టిన స్థలం, బాల్యం, లండన్ లో విద్యా బ్యాసం చేసిన స్థలం, ఆయన చనిపోయిన స్థలం, దీక్ష చేసిన ప్రాంతా లను పంచ తీర్థాలుగా ప్రధాని మోదీ రూపొందించి ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని ఎంపీ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి హి నమైన రాజకీయాలకు… వ్యతిరేకంగా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టి నట్లు ఎంపీ తెలిపారు.

అంబేద్కర్ ను అడుగడుగున అవమా నించింది – కాంగ్రెస్* *అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్*

కాంగ్రెస్ పార్టీ పెద్దలు తమ కు తాము భారతరత్నాలు ప్రకటించుకున్నారు.. తప్పి తే తన జీవితాన్నే ఈ దేశా నికి అంకితం చేసిన అంబే ద్కర్ కి భారతరత్న ఇవ్వ కపోగా అడుగడుగున అవమానించారని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అంబే ద్కర్ ని, బడుగు బల హీన వర్గాలను పావులుగా వాడుకుంటుందని అసలు అంబేద్కర్ ని ఓడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే ఆరోపించారు.బిజెపి పార్టీ చొరవతోనే అంబేద్కర్ కి భారతరత్న లభించిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply