పెద్దపల్లి, ఆంధ్రప్రభఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గురువారం ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజాంబాద్ జిల్లాలో పట్ట బద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్లు ఉదయం ఏడు గంటల నుండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలిక్ కేంద్రాలకు వచ్చారు. ఎనిమిది గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఉమ్మడి నాలుగు జిల్లాల్లో 773 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం 56 మంది పోటీలో ఉండగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం 15 మంది పోటీలో ఉన్నారు. ఎన్నికల అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్రిముక పోటీ జరుగుతుంది.