TG | ఎంజెపి డిగ్రీ సీట్ల రెండవ కేటాయింపు జాబితా విడుదల…

  • ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు
  • జూన్ 17వ తేదీ లోగా కళాశాలలో రిపోర్ట్ చేయాలి
  • ఎంజేపీ బీసీ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ప్రకటన

హైదరాబాద్‌: ఎంజేపీ బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల రెండవ విడత సీట్ల కేటాయింపు జాబితా బుధవారం విడుదలైంది. ఈ విషయాన్ని సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు అధికారిక ప్రకటన ద్వారా తెలియజేశారు.

ఈ జాబితా అభ్యర్థుల ఇంటర్మీడియట్ మార్కులు, ప్రాధాన్యతలు, మరియు సీట్ల లభ్యత (సీటు మ్యాట్రిక్స్) ఆధారంగా సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. వెబ్‌సైట్ https://tgrdccet.cgg.gov.in/TGRDCWEB/ లేదా https://mjptbcwreis.telangana.gov.in ద్వారా విద్యార్థులు తమ సీటు కేటాయింపు వివరాలను తెలుసుకోవచ్చని చెప్పారు.

సీటు కేటాయింపు పొందిన అభ్యర్థులు జూన్ 12 నుంచి జూన్ 17వ తేదీ లోపు తమకు కేటాయించిన గురుకుల డిగ్రీ కాలేజీకి వెళ్లి అవసరమైన ధృవీకరణ పత్రాలతో రిపోర్ట్ చేయాలి. నిర్ణీత గడువులో రిపోర్ట్ చేయకపోతే సీటు రద్దు అయ్యే అవకాశముందని ఆయన హెచ్చరించారు.

మరింత సమాచారం కోసం విద్యార్థులు 040-23328266 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా mjptbcwreis14@gmail.com కు మెయిల్ పంపవచ్చు.

Leave a Reply