TG | కార్మికులందరు సుభిక్షంగా ఉండాలని కోరుతూ మంత్రి వివేక్ ప్రత్యేక పూజలు

నస్పూర్, ( ఆంధ్రప్రభ) ఆషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాష్ట్ర కార్మిక శాఖమంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నస్పూర్ పట్టణం, సీసీసీ కార్నర్ లోని శ్రీశ్రీశ్రీ ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో అత్యధికంగా కార్మికులు ఉండే సింగరేణి ప్రాంతాల్లో నస్పూర్ పట్టణం ఒకటని, రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనం సమర్పించామన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ వంగల దయానంద్ దగ్గరుండి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply