TG | అచ్చోసిన ఆంబోతులా రంకెలు మానండి – రేవంత్ కు కెటిఆర్ హితవు
హైదరాబాద్ , రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై అచ్చోసిన ఆంబోతు మాదిరి రంకెలు వేయటం మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితవు పలికారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. తెలంగాణ ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. సభ సాక్షిగా నాలుగు కోట్ల ప్రజల ముందు సీఎం రేవంత్ బట్టలు విప్పుతామని హెచ్చరించారు. తెలంగాణ భవన్ లో ఆయన నేడు మ మీడియాతో మాట్లాడుతూ, పాలన చేతకాని సన్యాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విరుచుకుపడ్డారు. సొంత రాష్ట్రాన్ని క్యాన్సర్‌తో పోల్చిన భావదారిద్ర్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ దుయ్యబట్టారు.
భట్టికి కెటిఆర్ థ్యాంక్స్..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు చెప్పిన ఉప ముఖ్యమంత్రి భట్టికి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ ఆర్థికస్థితిపై ఫిబ్రవరి 17న డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేసిన సమగ్రమైన నివేదికను రేవంత్ చదువుకోవాలని సూచించారు. ఆర్ధిక విషయాలలో పాపం భట్టి విక్రమార్క అమాయకంగా ఇరుక్కున్నారని ఆయన ఉద్యోగం ఉంటదో.. పోతుందో? అని అనుమానం వ్యక్తం చేశారు. అప్పులకు వడ్డీ రేవంత్ 6వేల 500 కోట్లు అంటున్నారని.. భట్టి 2 వేల 200 కోట్లు అంటున్నారని తెలిపారు. వాస్తవాలన రేవంత్ ఇప్పటికే గ్రహించకుండా అబద్దాలతోనే యావత్ తెలంగాణను బద్నామ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ దివాలా తీసిందని గత 15 నెలలుగా కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రి తెలంగాణ పరువును గంగలో కలుపుతున్నారన్నారు. కాళేశ్వరంపై కొంతమంది సన్యాసులు చెత్తవాగుడు బంద్ చేయాలని అన్నారు.
కెసిఆర్ ను విమర్శించడం మానకుంటే …
సంపద సృష్టించటంలో కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందన్నారు. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం అంటూ వ్యాఖ్యలు చేశారు. సిగ్గు.. మానం లేని మూర్ఖపు ముఖ్యమంత్రి అని విమర్శించారు. కేసీఆర్‌ను దూషించటం మూనుకోకుంటే రేవంత్ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఢిల్లీ పార్టీలకు తెలంగాణను పరిపాలించుట చేదకాదని తేలిందన్నారు. కేంద్రం ఇచ్చే దానికంటే కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ ఇచ్చేది ఎక్కువ అని చెప్పుకొచ్చారు. ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అప్పులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. హైడ్రాతో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్‌కు వెన్నుపోటు పోడిచారన్నారు. నీళ్ళు ఇచ్చుడు చేతకాకుంటే క్రాప్ హాలిడే ప్రకటించాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు.
బండిపై ఫైర్..
కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచంగా నిలబడుతున్నారన్నారు. రేవంత్, సంజయ్‌లు ఆర్ఎస్ బ్రదర్స్ అని మార్కెట్‌లో చెప్పుకుంటున్నారన్నారు. సీఎం రేవంత్ అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. బిల్డర్స్ దగ్గర స్క్వేర్ ఫీట్‌కు రేవంత్ రెడ్డి 150 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. రాహుల్, మోదీ కులంతో ప్రజలకు ఏంటి లాభం అని ప్రశ్నించారు. అమృత్ టెండర్లు, పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్స్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సుంకిశాల ప్రాజెక్టు కుంగితే మేఘా కృష్ణారెడ్డిని రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. కృష్ణజాలల దోపిడీ విషయంలో అసెంబ్లీలో ఎండగడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి చేతకానితనంతోనే నీళ్ల కరవు
నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండన్న రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి వ్యాఖ్యలకు బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. ముందుచూపు లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతకానితనం వల్ల వచ్చిన కరవు.. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరవు అంటూ ఎక్స్ వేదికగా చురకలు అంటించారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదికాలంగా ఎండబెట్టి, రిజర్వాయర్లు పండబెట్టడం వల్లే రాష్ట్రంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నది వాస్తవం అన్నారు. రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ గా ఉంటూ ఉన్న వాస్తవాలు చెప్పాల్సింది పోయి.. వాటిని కప్పిపుచ్చి ఫిబ్రవరిలోనే ఎండలు ముదరడం వల్ల భూగర్భజలాలు పడిపోయాయనడం దారుణం అంటూ కొదండరెడ్డి పై ఫైర్ అయ్యారు కేటీఆర్