TG | కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ .. కెసిఆర్ కిట్ల పంపిణి

హైదరాబాద్ – మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోశంతోనే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని తెలిపారు.
తన పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ కిట్లను ఇస్తానని ప్రకటించిన కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా హైదరాబాద్‌కు చెందిన తల్లీబిడ్డలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ కిట్లను అందించారు. ఈ సంద‌ర్భంగా గత 20 నెలల నుంచి కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలా మంది తల్లులు బాధపడుతున్నారని కేటీఆర్ చెప్పారు. అందుకే తన పుట్టిన రోజు సందర్భంగా 5 వేల మంది తల్లులకు సిరిసిల్లలో కేసీఆర్ కిట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. 2014 కు ముందు నేను రాను బిడ్డో సర్కారు దవఖానాకు అని జనాలు భయపడేవారన్న కేటీఆర్.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న చర్యలతో సర్కార్ దవాఖానాకే పోవాలని జనాలంతా అనుకున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చిన కేసీఆర్ కిట్లను గత 20 నెలల నుంచి రేవంత్ సర్కార్ ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు. కేసీఆర్ మీద ఉన్న అంతులేని ద్వేషం, కోపమే ఇందుకు కారణమని విమర్శించారు.

వైద్య విద్యార్దికి సాయం..

గిఫ్ట్‌ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా పేద ఎంబీబీఎస్‌ విద్యార్థికి ఆర్థిక సాయం అందించేందుకు బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ సెల్‌కు చెందిన సంతోశ్‌ రోకండ్ల ముందుకొచ్చి.. రూ.1,40,000 లు అందజేశారు. మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుతున్న పేద ఎంబీబీఎస్ విద్యార్థి సింహాద్రి చదువు కోసం ఆర్థిక సాయం అందించాలని ఇటీవల కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కేటీఆర్‌ పిలుపు మేరకు గిఫ్ట్‌ ఏ స్మైల్‌ స్ఫూర్తితో బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ సెల్‌కు చెందిన సంతోశ్‌ రోకండ్ల ముందుకొచ్చారు. ఇవాళ సంతోశ్‌ కుటుంబసభ్యులైన రోకండ్ల జ్యోతి ఇవాళ కేటీఆర్‌ను కలిసి, ఆయన చేతుల మీదుగా ఎంబీబీఎస్‌ విద్యార్థి సింహాద్రికి రూ.1,40,000లు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా సంతోశ్‌ను కేటీఆర్‌ అభినందించారు.

Leave a Reply