TG | తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు – కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రెండు పార్టీలు తెలంగాణ నిధులను దుర్వినియోగం చేశాయని మండిపడ్డారు. కేసీఆర్ నీళ్ల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు. నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియా గాంధీని తెలంగాణ దెయ్యం అన్నార‌ని, ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగానే దేవత అంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు నిర్వ‌హించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామ‌న్నారు. తెలంగాణను 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారుర‌ని. ఇది కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పాపం కాదా అని ప్ర‌శ్నించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్. దోపిడీ, దగా, మోసం చేయడంలో దొందుదొందే. తెలంగాణను దోచుకుంటున్న పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్. ల నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరముంద‌న్నారు కిష‌న్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను పాతర వేయాల్సిందేన‌ని అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను బీజేపీ తీసుకుంటుంద‌న్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు తెలంగాణ నినాదానికి కట్టుబడిన పార్టీ బీజేపీ అని అన్నారు.

. తెలంగాణ ఉద్యమానికి కొంతమంది వెన్నుపోటు పొడిచార‌ని దెప్పి పొడిచారు. కేసీఆర్ నీళ్ల పేరుతో నిధులు దుర్వినియోగం చేశార‌ని ఆరోపించారు. . తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశార‌న్నారు. . సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ తెలంగాణ కోసం ఇతర పార్టీలతో కలిసి పోరాటం చేసింద‌ని తామేన‌ని అన్నారు.. 11 ఏళ్ల పాలన తర్వాత తెలంగాణ ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవాల‌న్నారు కేంద్ర‌మంత్రి.

బంగారు తెలంగాణ ఎక్కడ?.

కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తా అన్నార‌ని అయితే బంగారం కుటుంబంగా ఆయ‌న త‌న కుటుంబాన్ని మార్చుకున్నార‌ని ఆరోపించారు.. తెలంగాణాల‌ను . ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలా దోచుకున్నార‌న్నారు.. సకల జనుల సమ్మె పేరుతో ఉద్యమించిన వారి మీద, అమరవీరుల మీద ఒట్టేసి చెబుతున్నాను. తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తాం అని హామీ ఇచ్చారు.

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణకు సపోర్ట్ చేశారన్నారు. . సుష్మా స్వరాజ్ తెలంగాణ బిడ్డలారా చనిపోకండి మీకు అండగా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చార‌ని గుర్తు చేశారు.. ఇంకా రాజకీయం చేయొద్దు పిల్లలు చనిపోతున్నారు బిల్లు పెట్టండి అని చెప్పింది బీజేపీనే అని అన్నారు. ఈ నీళ్ళు, నిధులు, నియామకాల కోసం యువకులు పోరాటం చేశార‌ని అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతృత్వంలో తిరోగమన దిశలో తెలంగాణ పోతుంద‌న్నారు. తెలంగాణ తన గొప్పదనం చాటి చెప్పాలంటే బీజేపీతోనే సాధ్యం అని అన్నారు.

Leave a Reply