TG | స్వ‌ర్ణ‌కారుల‌పై పోలీసుల వేధింపులు – ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన క‌విత

హైద‌రాబాద్ – రాష్ట్రంలో కొందరు పోలీసుల పేరు చెప్పి స్వర్ణకారులను (goldsmit ) వేధింపులకు (harassment ) గురి చేస్తున్నార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (brs Mlc kavitha ) ఆరోపించారు. ఈ మేరకు కవిత నేడు వీడియో విడుద‌ల (video released ) చేశారు… ఇటీవల కాలంలో వరుసగా జరుగుతోన్న స్వర్ణకారుల ఆత్మహత్యలు కలిచి వేస్తున్నాయ‌న్నారు. విశ్వకర్మ వృత్తుల వారు యావత్ దేశానికే ఊపిరి పోస్తున్నవారికి కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో ఆయా వృత్తులకు ఆదరణ తగ్గిపోయింద‌న్నారు. .. క్రమేణ వృత్తి పని చేస్తున్న వారికి ఉపాధి లేకుండా పోతుంద‌ని వారి జీవనం నడవడమే ఇబ్బందికరంగా మారింద‌ని వివ‌రించారు. . మన దేశంలో బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉంద‌ని,. నగలను ఎంతో పవిత్రగా చూస్తార‌ని క‌విత పేర్కొన్నారు.

కేవలం స్వర్ణకారులే కాకుండా ఇతర కులాల వారు కూడా ఈ వృత్తిని ఉపాధిగా మార్చుకున్నార‌ని గుర్తు చేశారు. మహిళగా మెట్టెలు, మంగళసూత్రాలు చేయించాలంటే స్వర్ణకారుడి దగ్గరికి వెళ్తామే తప్ప పెద్ద పెద్ద షాపులకు వెళ్లలేమ‌ని చెప్పారు.. భారతీయులు పవిత్రంగా భావించే బంగారు, వెండి ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇటీవ‌ల కాలంలో దొంగ బంగారం కొన్నారని పోలీసులు స్వర్ణకారులపై కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని ఆరోపించారు.. ఆ బంగారం అమ్మిన దొంగలను మాత్రం పట్టుకోలేకపోతున్నార‌ని ఫైర్ అయ్యారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక కొందరు స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నార‌ని చెప్పారు.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాద‌ని స్వ‌ర్ణ‌కారుల‌ను కోరారు. తాను నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో స్వర్ణకారులను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకున్నాన‌ని అంటూ స్వర్ణకారులను వేధింపులకు గురి చేస్తున్న 411 చట్టానికి సవరణలు చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply