TG | తెలంగాణ భ‌వ‌న్ లో ఘ‌నంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుక‌లు …

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హరీశ్ రావుతో కలిసి మండలిలో విపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ వాణీ దేవి, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌, పార్టీ నేతలు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, పొన్నాల లక్ష్మయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ‌ను దేశంలోనే అగ్ర‌గామిగా నిలిపాం – కెసిఆర్

తెలంగాణ‌ను దేశంలోనే అగ్ర‌గామిగా నిలిపామ‌ని బిఆర్ ఎస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఆన్నారు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌ను ఎక్స్ ఖాతా ద్వారా ట్విట్ చేసిన ఆయ‌న తామ కొన‌సాగించిన స్ఫూర్తినే కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొన‌సాగించాల‌ని ఆకాంక్షించారు..

ద‌శాబ్దాల కోట్లాకు విముక్తి – హ‌రీశ్ రావు

రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘దశాబ్దాల కాలపు కొట్లాటకు, నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు విముక్తి లభించిన రోజు నేడు. సుదీర్ఘ స్వప్నం.. సాకారమైన సుదినం నేడు. ‘తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్‌ సచ్చుడో.. కేసీఆర్‌ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో’ అంటూ నినదించిన కేసీఆర్ గారు గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు. సబ్బండ వర్గాలు ఏకమై గర్జించి, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాట ఫలితం తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువ లేనివి. వారికి జోహార్లు.’ అంటూ హరీశ్‌ రావు ఎక్స్‌ వేదికగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

Leave a Reply