TG | ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ – ఐదుగురు విద్యార్థుల ఆత్మహత్య

హైద‌రాబాద్ – ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష ఫెయిల్ కావ‌డంతో తెలంగాణ‌కు చెందిన అయిదుగురు విద్యార్ధులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినికి ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది అశ్విత.


హైదరాబాద్ మోతీనగర్ సమీపంలోని అవంతినగర్‌కు చెందిన విద్యార్థి బల్కంపేటలోని కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువు తున్నాడు.. పరీక్షలో ఫెయిల్ కావడంతో ఆవేదనకు గురై.. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లికి చెందిన విద్యార్థిని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదివింది.. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తాను అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని మ‌న‌స్తాపంలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణం పొందింది.


నాగోలు తట్టిఅన్నారం వైఎస్ఆర్ కాలనీకి చెందిన విద్యార్థిని ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన విద్యార్థి స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) ప్రథమ సంవత్సరం చదివాడు.. పరీక్షలో ఫెయిల్ కావడంతో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు

Leave a Reply