TG | కెటిఆర్ పై మరో కేసు నమోదు..

హైదరాబాద్ – బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై (KTR) సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat ) నేడు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, అలాగే సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేసిన వీడియోలను సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులకు అందజేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్ల కేటీఆర్ మాట్లాడిన మాటలు అవమానకరంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, సామాజిక శాంతిని భంగపరిచే విధంగా ఉన్నాయని బల్మూరి వెంకట్ ఫిర్యాదులొ తెలిపారు. ఈ కేసుతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. రాజకీయ కక్ష్యలో భాగంగానే తమ నేతపై కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

Leave a Reply