TG | ఈ నెల 14న భూ భారతి పోర్టల్ ఆవిష్క‌ర‌ణ !

  • పైలెట్ ప్రాజెక్టుగా మూడు మండ‌లాల్లో

తెలంగాణ భూ భారతి ఆవిష్కరణకు తేదీ ఖ‌రారైంది. ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈపోర్ట‌ల్ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున…. రాష్ట్రంలోని ఎంపిక చేసిన మూడు మండలాల్లో భూ భారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్టును నిర్వహించ‌నుంది రెవెన్యూ శాఖ.

కాగా, భూ భారతి పోర్టల్ పై ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించడానికి అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలని సీఎం ఆదేశించారు.

ప్రజలకు సౌకర్యవంతంగా భూ భారతి పోర్టల్ ఉండేల‌ని.. పైలట్ ప్రాజెక్టులో ప్రజల నుండి సూచనలు, సిఫార్సులను స్వీకరించి పోర్టల్‌ను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Leave a Reply